మెనూ ప్రకారం భోజనం అందించాలి : కలెక్టర్​ వి. విక్టర్

భిక్కనూరు,వెలుగు : స్టూడెంట్లకు మెనూ ప్రకారం భోజనం అందించాలని అదనపు కలెక్టర్​ వి.విక్టర్ హాస్టల్​ సిబ్బందిని​ ఆదేశించారు. సోమవారం మండలంలోని జంగంపల్లి మహాత్మజ్యోతి పూలే రెసిడెన్షియల్​ స్కూల్​ను  సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ .. హాస్టల్​లో స్టూడెంట్లకు వసతులు కల్పించాలన్నారు.  అనంతరం స్టూడెంట్స్​తో కలిసి భోజనం చేశారు.   

బోధన్, వెలుగు : బోధన్ ప్రభుత్వ వసతి గృహాలను జిల్లా అదనపు వైద్య ఆరోగ్యశాఖ అధికారి సమత, ఫుడ్ సేఫ్టీ అధికారి డాక్టర్ వినీత్ సందర్శించారు.  విద్యార్థులకు అందిస్తున్న భోజనాన్ని పరిశీలించారు. రుచికరమైన భోజనం అందించడంతో పాటు విద్యార్థుల ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించాలని వసతి గృహం నిర్వాహకులకు  సూచించారు. పరిసరాల పరిశుభ్రతపై జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. 

సదాశివనగర్, వెలుగు : హాస్టల్ స్టూడెంట్లకు ప్రభుత్వం నిర్దేశించిన మేనూ ప్రకారం భోజనం అందించాలని సదాశివనగర్​ తహసీల్దార్​ గంగాసాగర్​ ఆదేశించారు. సోమవారం సదాశివనగర్​బీసీ హాస్టల్​ను తనిఖీ చేశారు.  విద్యార్థుల హాజరు శాతం, వంటశాల, వంటసామగ్రిని పరిశీలించారు. అనంతరం​ ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ హాస్టల్ స్టూడెంట్లకు మేనూ ప్రకారం భోజనం అందించాలని, లేకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో ఆర్ఐ సాహితీ, జూనియర్​ అసిస్టెంట్​రాజు తదితరులు పాల్గొన్నారు. 

ఆర్మూర్​, వెలుగు : స్టూడెంట్స్ కు పరిశుభ్రమైన భోజనం అందించాలని ఆర్మూర్​ఎంఈవో పింజ రాజగంగారాం ఆదేశించారు. సోమవారం ఆర్మూర్​ కేజీబీవీ, మోడల్ స్కూల్, హాస్టల్​ను తనిఖీ చేశారు. వంట సామాగ్రి, కూరగాయల నాణ్యతను పరిశీలించారు.