ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలి : కలెక్టర్ ఇలా త్రిపాఠీ

నకిరేకల్, (వెలుగు ): ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠీ అధికారులను ఆదేశించారు. నకిరేకల్ శివారులోని చీమలగడ్డలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్​మాట్లాడుతూ రైతులు ధాన్యాన్ని ఆరబెట్టుకొని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని సూచించారు. ధాన్యం కొనుగోళ్లలో రాష్ట్రంలో జిల్లా ప్రథమ స్థానంలో ఉన్నందున కేంద్రాలకు వచ్చిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు మిల్లులకు తరలించాలని తెలిపారు. ఆమె వెంట డీఎస్ వో వెంకటేశ్వర్లు, స్థానిక తహసీల్దార్ జమురుద్దీన్, డీటీసీఎస్ జ్యోతి, పీఎస్సీ సీఈవో లక్ష్మారెడ్డి, కేంద్రం ఇన్​చార్జి నాగరాజు ఉన్నారు.

సమగ్ర సర్వేను పకడ్బందీగా చేపట్టాలి..

శాలిగౌరారం (నకిరేకల్), వెలుగు : తెలంగాణ ప్రభ్యత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ కుటుంబ సర్వేను పకడ్బందీగా చేపట్టాలని  కలెక్టర్ ఇలా త్రిపాఠీ అధికారులను ఆదేశించారు. శుక్రవారం శాలిగౌరారం మండలంలో పలు గ్రామాల్లో కుటుంబ సర్వే చేసే సూపర్ వైజర్లు, ఎన్యూమరేటర్లు ఇంటింటికీ వెళ్లి నంబరింగ్ వేశారు. శాలిగౌరారం, వల్లాల గ్రామాల్లో నంబరింగ్ చేస్తున్న విధానాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. అన్ని అంశాలను క్షుణ్ణoగా పరిశీలించి తప్పులు దొర్లకుండా వివరాలను పొందుపర్చాలని కలెక్టర్ సూచించారు. కార్యక్రమంలో మండల స్పెషల్ ఆఫీసర్ మాన్యానాయక్, తహసీల్దార్ పి.యాదగిరి, ఎంపీడీవో జ్యోతీలక్ష్మి పాల్గొన్నారు.