సీఎం కప్ క్రీడల్లో సూర్యాపేట జిల్లా ముందుండాలి : కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్  

సూర్యాపేట, వెలుగు : సీఎం కప్ క్రీడా పోటీల్లో సూర్యాపేట జిల్లా ముందుండాలని కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ సూచించారు. గురువారం కలెక్టరేట్​నుంచి అధికారులతో వెబెక్స్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్​మాట్లాడుతూ గ్రామ, మండల, జిల్లా స్థాయి క్రీడల నిర్వహణపై సంబంధిత శాఖ అధికారులు దృష్టి సారించాలన్నారు. జిల్లాలోని 23 మండలాల్లో సీఎం కప్​క్రీడల్లో పాల్గొన్న విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు.

ఆసక్తి గల క్రీడాకారులు తమ పేరును http://cmcup2024.telangana.gov.in లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. గ్రామ స్థాయిలో 7 ,8 తేదీల్లో క్రీడలు నిర్వహిస్తామన్నారు. మండల, పురపాలక స్థాయిలో 10 నుంచి 12వ తారీఖు వరకు, జిల్లా స్థాయి 16 నుంచి 21 వరకు, రాష్ట్ర స్థాయిలో డిసెంబర్ 27 నుంచి జనవరి 2 వరకు క్రీడా పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. కాన్ఫరెన్స్​లో జిల్లా యువజన క్రీడల అధికారి రామచంద్రరావు, డీఆర్డీవో వీవీ అప్పారావు, డీపీవో నారాయణరెడ్డి, సీపీవో కిషన్, రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు.