పరిశ్రమలకు సహకారం అందిస్తాం 

కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్   

సూర్యాపేట, వెలుగు : జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు అన్ని విధాలా సహకారం అందజేస్తామని కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ తెలిపారు. గురువారం కలెక్టరేట్ లో జిల్లా పరిశ్రమల ప్రోత్సాహక కమిటీ, డీఐపీసీ, టీఎస్ ఐపాస్ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కొత్త పరిశ్రమల స్థాపనకు చేసుకున్న దరఖాస్తులను పరిశీలించి సింగల్ విండో ద్వారా అనుమతులు మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు.

ఇప్పటికే పెండింగ్ లో ఉన్న దరఖాస్తులను పరిశీలించి తక్షణమే మంజూరు చేయాలన్నారు. ఎస్సీ, ఎస్టీ సంబంధించిన టీ ప్రైడ్ పథకం కింద 67 యూనిట్లు మంజూరు చేస్తూ కమిటీ తీర్మానం చేసిందని, టీఎస్ ఐపాస్ 8 యూనిట్లకు 19 అప్రూవల్ కమిటీతో రివ్యూ చేసినట్లు తెలిపారు.

సమావేశంలో ఇండస్ట్రియల్ మేనేజర్ సీతారాం, ఎల్డీఎం బాపూజీ, సీపీవో కిషన్, ఫైర్ ఆఫీసర్ జానయ్య, మోటార్ వెహికల్ ఇన్​స్పెక్టర్ ఆదిత్య, సిటీవో యాదగిరి, టీటీసీపీవో మాధవి, అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.