జిల్లాలో డ్రగ్స్ నిర్మూలనకు కృషి చేయాలి : తేజస్ నందలాల్ పవార్

  • కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్  

సూర్యాపేట, వెలుగు : జిల్లాలో డ్రగ్స్ నిర్మూలన కోసం ప్రతిఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ పిలుపునిచ్చారు. మంగళవారం ఐడీవోసీ కాన్ఫరెన్స్ హాల్ లో అధికారులతో నషాముక్త భారత్ అభియాన్ జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి స్కూల్, కాలేజ్ లో యాంటి డ్రగ్ కమిటీలు వేయాలని, మాదకద్రవ్యాలపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని సూచించారు. గ్రామం నుంచి జిల్లా స్థాయి వరకు వలంటీర్స్ ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.

డ్రగ్స్ పై అవగాహన కల్పించేందుకు ప్రతి స్కూల్, కాలేజీలో పోస్టర్లు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కాంపెయిన్ లో ట్యాగ్ లైన్ గా ‘డ్రగ్స్​ ఫ్రీ సూర్యాపేట’ అనే పేరు పెట్టామని తెలిపారు. అనంతరం డ్రగ్స్ పై​అవగాహన పోస్టర్స్ ను కలెక్టర్ ఆవిష్కరించారు. సమావేశంలో అడిషనల్ ఎస్పీ నాగేశ్వర్ రావు, డీఎఫ్ వో సతీశ్, డీపీవో నారాయణరెడ్డి, ఆర్డీవోలు వేణుమాధవ్ రావు, సూర్యనారాయణ, శ్రీనివాసులు, లక్ష్మనాయక్, జిల్లా సంక్షేమశాఖ అధికారి నరసింహరావు, డీఎంహెచ్​వో కోట చలం, డీఈవో అశోక్, డ్రగ్ ఇన్​స్పెక్టర్ సురేందర్ రెడ్డి, డీఐఈవో భానునాయక్ తదితరులు పాల్గొన్నారు.