పర్యాటక రంగంపై అవగాహన ఉండాలి : కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్

సూర్యాపేట, వెలుగు: పర్యాటక రంగం, చరిత్ర పై విద్యార్దులకు అవగాహన ఉండాలని కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ సూచించారు. ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా శుక్రవారం కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. సూర్యాపేట జిల్లాలో అద్బుతమైన చారిత్రక సంపద ఉందన్నారు. ప్రతి ఒక్కరూ చరిత్ర, సంస్కృతి తెలుసుకోవాలని సూచించారు.  అనంతరం నిర్వహించిన కొండా లక్ష్మణ్​బాపూజీ జయంతి సందర్భంగా ఆయన ఫొటోకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. బ్యాంకర్లతో ఏర్పాటు చేసిన మావేశంలో రైతులందరికీ కొత్త రుణాలు అందజేయాలని కలెక్టర్​ సూచించారు.

 ఈ ఆర్థిక సంవత్సరంలో  రూ. 2975.17 కోట్లను బ్యాంకర్లు ప్రజలకు రుణాల రూపంలో ఇచ్చారని తెలిపారు. బ్యాంకర్లు తమ లక్ష్యాలను ఈ ఆర్థిక సంవత్సరానికి గాను అధిగమించాలని రైతులు ఎవరిని ఇబ్బంది పెట్టొద్దని వీధి వ్యాపారులకు మొదటగా ఇచ్చిన లోన్ రికవరీ తర్వాత ఎలాంటి ఇబ్బందులు లేకుండా వెంటనే వారికి కూడా రుణాలు అందే విధంగా చూడాలని కలెక్టర్ బ్యాంకర్లను సూచించారు. అంతర్జాతీయ వయోవృద్ధుల వారోత్సవాల్లో భాగంగా సూర్యాపేట గాంధీ పార్కు నుంచి మినీ ట్యాంక్ బండ్ వరకు వయోవృద్ధుల ర్యాలీ  నిర్వహించారు.