21 వరకు అభ్యంతరాల స్వీకరణ

  • జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ 

సూర్యాపేట, వెలుగు:  రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈనెల 13న ప్రచురించిన ముసాయిదా ఓటర్ జాబితాలపై 21లోగా పంచాయతీ కార్యదర్శులకు ఫిర్యాదు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ తెలిపారు. బుధవారం కలెక్టరేట్‌‌‌‌లో  గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అభ్యంతరాలను పరిశీలించి ఈనెల 26 లోగా పరిష్కరిస్తామన్నారు.

 18న జిల్లాస్థాయి, 19న మండల స్థాయిలో జరిగే సమావేశాలకు అన్ని పార్టీల ప్రజాప్రతినిధులను పిలవాలని కలెక్టర్ సూచించారు. జిల్లాలో ఇంటింటి సర్వే నిర్వహించి ఓటరు జాబితా సరిచేయాలని, మరణించిన వారి పేర్లు తొలగింపు, అడ్రస్ చెంజ్ ఆన్లైన్లో వచ్చిన ఫామ్స్ విచారణ చేసి ఐటి టూల్స్ ద్వారా సరిచేయాలని తెలిపారు. కార్యక్రమంలో జడ్పీ సీఈవో వీవీ అప్పారావు  డీపీవో నారాయణరెడ్డి, ఎలక్షన్ సూపరింటెండెంట్  శ్రీనివాసరాజు, డీ సెక్షన్ సూపరింటెండెంట్ పద్మారావు, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు, అధికారులు,
 సిబ్బంది పాల్గొన్నారు.

ఎన్‌‌‌‌ఎంఎంఎస్ స్టడీ మెటిరియల్ సద్వినియోగం చేసుకోవాలి 

సూర్యాపేట, వెలుగు: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థిని, విద్యార్థులు తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఉచితంగా అందించే ఎన్ఎంఎంఎస్ స్టడీ మెటీరియల్ ను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ తెలిపారు. బుధవారం జిల్లా కలెక్టరేట్ లో టీపీయూఎస్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉచితంగా అందించే నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్షిప్ పరీక్ష కు సంబంధించిన  స్టడీ మెటీరియల్ ను జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా టీపీయూఎస్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పర్వతం సంధ్యారాణి, యామా రమేశ్, జిల్లా విద్యాశాఖ అధికారి కే. అశోక్, జిల్లా విద్యాశాఖ కోఆర్డినేటర్ ఎర్రం శెట్టి రాంబాబు పాల్గొన్నారు.