ఎలక్షన్​ పోలీసు అబ్జర్వర్‌‌తో కలెక్టర్, ఎస్పీ భేటీ

కామారెడ్డిటౌన్​, వెలుగు:  జహీరాబాద్, నిజామాబాద్​ పార్లమెంట్​స్థానాల పోలీసు అబ్జర్వర్‌‌గా వచ్చిన రాజేశ్ మీనాతో ఆదివారం కామారెడ్డి కలెక్టర్​ జితేష్​వి పాటిల్, ఎస్పీ సింధూశర్మ జిల్లా కేంద్రంలో భేటీ అయ్యారు.  కామారెడ్డి జిల్లాలో  ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడానికి తీసుకుంటున్న చర్యలను వివరించారు.  ప్రతిరోజు తనిఖీలు, అంతర్​జిల్లా, ​స్టేట్​చెక్​పోస్టుల్లో తనిఖీలు, బార్డర్​స్టేట్​ఆఫీసర్లతో  కో ఆర్డినేషన్​పై గురించి తెలిపారు.  ఎన్నికల మీటింగ్‌లు, ప్రచారాలు నిశితంగా పరిశీలిస్తున్నామన్నారు.   అడిషనల్​ఎస్పీ నరసింహారెడ్డి,  డీఎస్పీ నాగేశ్వరరావు, సీఐలు   చంద్రశేఖర్​రెడ్డి, రామన్​తదితరులు  ఉన్నారు.