ఇందిరమ్మ ఇళ్ల సర్వేలో అర్హులను గుర్తించాలి : కలెక్టర్​ సత్యప్రసాద్​ 

 కోరుట్ల/జగిత్యాల రూరల్‌‌‌‌, వెలుగు: ఇందిరమ్మ ఇళ్ల సర్వేలో అర్హులైన వారినే గుర్తించాలని జగిత్యాల కలెక్టర్​ సత్యప్రసాద్​అధికారులకు సూచించారు. బుధవారం జగిత్యాల రూరల్‌‌‌‌ మండలం థరూర్‌‌‌‌‌‌‌‌, కోరుట్ల పట్టణంలోని 3,4 వార్డుల్లో, కథలాపూర్​ మండలం సిరికొండ గ్రామంలో నిర్వహిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల సర్వే ప్రక్రియను కలెక్టర్ సత్యప్రసాద్​​పరిశీలించారు.

ప్రభుత్వం రూపొందించిన మొబైల్​యాప్​ ద్వారా సర్వేను పూర్తి చేయాలన్నారు.జిల్లాలోని 18 మండలాలు, ఐదు మున్సిపాలిటీల నుంచి 2,02,011 లక్షల మంది ప్రజా పాలనలో ఇందిరమ్మ ఇండ్లకు దరఖాస్తు చేసుకున్నారన్నారు. కలెక్టర్​ వెంట హౌసింగ్ డీఈ రాజేశ్వరరావు, ఆర్డీవోలు జివాకర్, మధుసూదన్‌‌‌‌, మున్సిపల్​కమిషనర్ తిరుపతి పాల్గొన్నారు.​