ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో వేగం పెంచాలి : కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

రాజన్నసిరిసిల్ల, వెలుగు: ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల దర్యాప్తు స్పీడప్‌‌‌‌‌‌‌‌ చేయాలని రాజన్నసిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పోలీసులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌లో ఎస్పీ అఖిల్‌‌‌‌‌‌‌‌ మహాజన్‌‌‌‌‌‌‌‌తో కలిసి అట్రాసిటీ కేసులపై జిల్లా స్థాయి విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ మీటింగ్‌‌‌‌‌‌‌‌ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో నవంబర్ 30 నాటికి 30  అట్రాసిటీ కేసుల నమోదయ్యాయని, వీటి పురోగతిపై వారంలో నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. 2016 నుంచి ఇప్పటివరకు 8 మర్డర్లు, 4 రేప్ కేసులు, 486 అట్రాసిటీ కేసులు నమోదైనట్లు చెప్పారు.

అట్రాసిటీ కేసులపై విస్తృత స్థాయిలో ప్రచారం కల్పించాలని అన్నారు. ఎస్సీ, ఎస్టీ శాఖల పరిధిలోని హాస్టళ్లు, గురుకులాల్లో విద్యార్థులకు నాణ్యమైన భోజనం, అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌, బెస్ట్ అవైలబుల్ స్కీమ్.. వంటి పథకాలను పకడ్బందీగా అమలు చేస్తున్నామన్నారు. సమావేశంలో ఆర్డీవోలు వెంకట ఉపేందర్ రెడ్డి, రాజేశ్వర్, సెషన్స్ కోర్టు అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాములు, జిల్లా ఎస్సీ అభివృద్ధి అధికారి విజయలక్ష్మి, ఎస్సీ కార్పొరేషన్ ఏడీ స్వప్న పాల్గొన్నారు.