రాజన్నసిరిసిల్ల,వెలుగు:- ఈ నెల 15లోపు మిల్లర్లు పెండింగ్ సీఎంఆర్ ఇవ్వాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. మంగళవారం జిల్లాలోని బాయిల్డ్, రా రైస్ మిల్లర్లతో కలెక్టర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొందరు మిల్లర్లు 2023–24 సంవత్సరానికి సంబంధించిన వానకాలం, యాసంగి సీఎంఆర్ పెండింగ్‌లోనే ఉందన్నారు.
ఎట్టి పరిస్థితుల్లో గడువు పెంచేది లేదని, 15లోగా అప్పగించాలని ఆదేశించారు. ఈ వానకాలం సీజన్ ధాన్యాన్ని తమ మిల్లుల్లో దించుకున్న మిల్లర్లు ప్రభుత్వం ఆదేశాలకు అనుగుణంగా బ్యాంక్ గ్యారంటీ ఇవ్వాలని ఆదేశించారు. సమావేశంలో సివిల్ సప్లై ఆఫీసర్ వసంత లక్ష్మి, మేనేజర్ రజిత, బాయిల్డ్, రా రైస్ మిల్లర్లు, అధికారులు పాల్గొన్నారు.