నేతన్నల సమస్యలపై స్పెషల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫోకస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ : సందీప్ కుమార్ ఝా

  • 15 రోజుల్లో ధరణి సమస్యలు పరిష్కరిస్తాం
  • ప్రజాపాలనకు ప్రాధాన్యం
  • అర్హులకు ప్రభుత్వ పథకాలను అందజేయడమే లక్ష్యం 
  •  ‘వీ6వెలుగు’ ఇంటర్వ్యూలో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

రాజన్నసిరిసిల్ల, వెలుగు: నేతన్నల సమస్యలపై స్పెషల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫోకస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పెడతామని రాజన్నసిరిసిల్ల జిల్లా కలెక్టర్  సందీప్ కుమార్ ఝా అన్నారు. ఆయన జిల్లా కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఇటీవల బాధ్యతలు చేపట్టారు. జిల్లా ఆఫీసర్లను సమన్వయం చేసుకుంటూ ప్రజాపాలన అందించడమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. అర్హులకు ప్రభుత్వ పథకాలు అందేలా కృషి చేస్తామన్నారు. నేతన్నల ఆత్మహత్యలు, ఇతర సమస్యలపై స్టడీ చేస్తున్నట్లు ‘వీ6వెలుగు’ ఇంటర్వూలో వెల్లడించారు. 

ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేస్తాం

ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను జిల్లాలో అర్హులైనవారికి అందజేస్తాం. గృహజ్యోతి, రేషన్ పంపిణీ, పింఛన్లు అర్హులైన ప్రతి పేదవాడికి చేరేలా చూస్తాం. ఇప్పటికే డిపార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ల వారీగా జిల్లా అధికారులతో ప్రతి రోజు రివ్యూలు నిర్వహిస్తున్నాం.

ధరణి పెండింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దరఖాస్తులను పరిశీలిస్తాం

ధరణి సమస్యలపై స్పెషల్ ఫోకస్ పెడుతున్నాం జిల్లాలో 2,139 ధరణి పెండింగ్ దరఖాస్తులున్నాయి. వాటిని 15రోజుల్లో పరిష్కరించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నాం. పెండింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దరఖాస్తుల పరిశీలనను ఇప్పటికే ప్రారంభించాం. రికార్డులను పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశాలిచ్చాం.

గ్రీవెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కంటిన్యూ చేస్తాం 

ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తేవడానికి ప్రజావాణి ఉపయోగకరంగా ఉంటుంది. ప్రతి సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ప్రజావాణిలో  ఒకేచోట ఆఫీసర్లంతా ఉండి వచ్చిన అర్జీలను డిపార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ల వారీగా ఆఫీసర్లకు  అందజేసి, పరిష్కరించాలని ఆదేశిస్తున్నాం. గ్రీవెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వచ్చిన దరఖాస్తులు పెండింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పెట్టొద్దని ఇప్పటికే అధికారులకు ఆదేశాలిచ్చాం. 

సిరిసిల్లలో వరదల నియంత్రణకు చర్యలు 

వర్షకాలంలో సిరిసిల్ల పట్టణంలోని లోతట్టు ప్రాంతాలు కొన్ని ముంపుకు గురవుతున్నాయి. సిరిసిల్ల టౌన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వరదలు రాకుండా సమస్యలను గుర్తించేందుకు సంబంధిత అధికారులతో మాట్లాడుతున్నాం. తీసుకోవల్సిన చర్యలతోపాటు తాత్కాలికంగా జరుగుతున్న పనులను పర్యవేక్షిస్తా. వరద ముంపు నివేదిక రూపొందించి ప్రభుత్వానికి అందజేస్తాం. ప్రభుత్వ ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటాం. వర్షకాలం నేపథ్యంలో సీజనల్ వ్యాధుల వ్యాప్తిపై వైద్యారోగ్య శాఖ అధికారులు అప్రమత్తంగా ఉన్నారు. ఇటీవల కోనరావుపేట మండలంలోని ఓ స్కూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను విజిట్ చేశాను. ప్రభుత్వ బడుల్లో అన్ని వసతులు ఉండేలా చర్యలు తీసుకుంటాం.  

రుణమాఫీ లెక్కలు తీస్తున్నాం

రాష్ట్ర ప్రభుత్వం రైతులకు రూ.2లక్షల వరకు రుణమాఫీ చేస్తానని ప్రకటించింది. జిల్లాలో రుణమాఫీకి సంబందించిన ప్రక్రియ నడుస్తోంది. ప్రభుత్వ గైడ్ లైన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అందిన వెంటనే రుణమాఫీ ప్రక్రియ పూర్తి చేస్తాం. జిల్లాలో 62వేల మంది రైతులు రూ.703 కోట్లు రుణం తీసుకున్నారు. ప్రభుత్వ గైడ్ లైన్స్ అనుసరించి ఎంత మంది రైతులు అర్హులవుతారో తేలాల్సి ఉంది. 

ప్రభుత్వం దృష్టికి నేత సమస్యలు

సిరిసిల్లలో నేతన్నలు ఎక్కువ. వారి సమస్యలపై స్టడీ చేసి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తా. నేతన్నలకు ఉపాధి కల్పించేందుకు స్కూల్ యూనిఫాం కోసం గతంలోనే 65లక్షల మీటర్ల క్లాత్ ఉత్పత్తికి ప్రభుత్వం ఆర్డర్స్​ఇచ్చింది. ఉత్పత్తి జరిగి ప్రొక్యూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్​ కూడా పూర్తయింది.