నాది ఓ నెగెటివ్​బ్లడ్​ ..అవసరమైతే అడగండి ఇస్తా..

  • సిరిసిల్ల ఆస్పత్రిలో డాక్టర్లతో కలెక్టర్​ సందీప్​ కుమార్​ ఝా

సిరిసిల్ల టౌన్, వెలుగు : తనది ఓ నెగిటివ్​ బ్లడ్​ అని,  ఆస్పత్రిలో ఎప్పుడైనా ఎమర్జెన్సీ ఉంటే ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని కలెక్టర్​ సందీప్​ కుమార్​ ఝా అన్నారు.  జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిని శనివారం ఆయన తనిఖీ చేశారు.  ఎమర్జెన్సీ వార్డులు, బ్లడ్​ బ్యాంక్​, ఐసీయూ, మెటర్నిటీ, ఆపరేషన్​ థియేటర్లను తనిఖీ  చేశారు. అనంతరం డాక్టర్లతో మాట్లాడారు.  బ్లడ్ బ్యాంకులో రక్తం విలువలపై ఆరా తీశారు.

అత్యవసర పరిస్థితుల్లో రోగులకు అవసరమైతే తన రక్తం  అందిస్తానని కలెక్టర్ తెలిపారు. వ్యక్తిగత పరిశుభ్రత పై రోగులకు అవగాహన కల్పించాలని సూచించారు. ఆసుపత్రి లో నీటి సమస్యపై రోగులు తెలపగా, వాటిని పరిష్కరిస్తామని కలెక్టర్ పేర్కొన్నారు. ఆయనతోపాటు  ఆర్ఎం ఓ సాయికుమార్, వైద్యులు వినత, నికిత, నర్సులు వైద్య సిబ్బంది ఉన్నారు.