48 గంటల్లో డబ్బులు జమ చేయాలి : కలెక్టర్​ రాజీవ్​ గాంధీ 

నిజామాబాద్/డిచ్​పల్లి, వెలుగు: ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రంలో ధాన్యం అమ్మిన రైతులు పేమెంట్​ కోసం ఎదురుచూసే పరిస్థితి ఎక్కడా తలెత్తడానికి వీలులేదని కలెక్టర్​ రాజీవ్​గాంధీ హనుమంతు అన్నారు. గురువారం ఆయన డిచ్​పల్లి మండలం రాంపూర్​ కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి​ రైతులతో మాట్లాడారు. ధాన్యాన్ని రైస్​మిల్స్​కు తరలించిన తరువాత ట్రక్​షీట్స్​ తెప్పించుకొని ట్యాబ్​ఎంట్రీలు పూర్తి చేయాలన్నారు. ధాన్యం కొనుగోలు ముగిసిన 48 గంటలలో రైతుల ఖాతాల్లో డబ్బులు జమకావాలన్నారు. రైస్​ మిల్లుల వద్ద తరుగు విధించడానికి వీలులేదన్నారు. 

మెనూ ప్రకారమే స్టూడెంట్స్​కు భోజనం

సర్కారు నిర్దేశించిన విధంగా విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని కలెక్టర్​ఆదేశించారు. రాంపూర్​లోని జ్యోతిబాపూలే బీసీ బాయ్స్​గురుకులం పాఠశాలను సందర్శించారు.  స్టోర్​రూంలోని బియ్యం, సరుకులు, కిచెన్, డైనింగ్​పరిశీలించారు.  వడ్డించడానికి ముందే భోజనాన్ని పరిశీలించాలన్నారు. ఎలాంటి సమస్యలున్నా తహసీల్దార్​ దృష్టికి వెంటనే తీసుకురావాలని సూచించారు.