వన మహోత్సవంలో భాగస్వాములు కావాలి : కలెక్టర్​ రాజీవ్​ గాంధీ 

నిజామాబాద్, వెలుగు : పర్యావరణ రక్షణ కోసం వన మహోత్సవ ప్రోగ్రాంలో అన్ని వర్గాలను భాగస్వాములను చేసి సక్సెస్ చేయాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు సూచించారు.  మూడు వారాలు ఈ అంశానికి టాప్​ ప్రయారిటీ ఇవ్వాలన్నారు.  శుక్రవారం ఆయన తన కార్యాలయంలో ఫారెస్ట్, ఇతర శాఖలతో మీటింగ్​ నిర్వహించి మాట్లాడారు. రోడ్లకు ఇరువైపులా ఖాళీ ప్రదేశాలను గుర్తించి మొక్కలు నాటాలన్నారు.

చెరువులు, కాలువ కట్టలపై పెద్ద ఎత్తున మొక్కలు నాటి ఆన్​లైన్​లో జియో ట్యాగ్​ చేయాలన్నారు. ప్రతి రోజు ప్రగతి నివేదిక తనకు అందించాలని కోరారు. ఎంపీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, మున్సిపల్​ పాలక సభ్యులను మండల స్పెషల్​ ఆఫీసర్లు ఇందులో కీలక పాత్ర పోషించాలన్నారు.  అదనపు కలెక్టర్ అంకిత్​, నగర పాలక కమిషనర్​ మంద మకరంద్​ తదితరులు ఉన్నారు.

జడ్పీ స్పెషల్​ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా కలెక్టర్

నిజామాబాద్, వెలుగు : జిల్లా పరిషత్​ స్పెషల్​ఆఫీసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా రాజీవ్​గాంధీ హన్మంతు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. సీఈవో ఉషా ఆయనకు పుష్పగుచ్చం ఇచ్చి స్వాగతం పలింకారు.  జడ్పీ వివరాలను తెలుసుకొని అత్యవసర​ కావాల్సిన అంశాలపై చర్చించారు.  పంచాయతీరాజ్ ఎస్​ఈ శంకర్​ తదితరులున్నారు.  జిల్లా పరిషత్​ పాలకవర్గం పదవీకాలం ముగియడంతో కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను స్పెషల్ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా నియమిస్తూ గవర్నమెంట్​ఆదేశాలు జారీ చేసింది.