హిట్​ అండ్​ రన్​ కేసుల విచారణ పూర్తిచేయాలి : కలెక్టర్​ రాజీవ్​ గాంధీ

​నిజామాబాద్, వెలుగు:  గుర్తు తెలియని వాహనాలు ఢీకొని మరణించిన లేక తీవ్రంగా గాయపడిన కేసులు త్వరగా విచారించి ప్రభుత్వ​పరిహారం అందేలా చూడాలని కలెక్టర్​ రాజీవ్​గాంధీ సూచించారు. గురువారం కలెక్టరేట్​లో మీటింగ్​ నిర్వహించి మాట్లాడారు. జిల్లాలో 32 హిట్​ అండ్​ రన్​ కేసులు నమోదయ్యాయని, 27 ఘటనలకు సంబంధించి బాధితులను గుర్తించామన్నారు.

ఆర్డీవోల నేతృత్వంలో కేసులు పరిష్కరించి మృతుల కుటుంబాలకు బీమా కౌన్సిల్​ ద్వారా రూ.2 లక్షలు, తీవ్రంగా గాయపడిన బాధితులకు రూ.50 వేల నష్టపరిహారం అందేలా ప్రతిపాదనలు పంపాలని కోరారు. బోధన్​ సబ్​ కలెక్టర్​ వికాస్​ మహతో, అదనపు డీసీపీ బస్వారెడ్డి, ఆర్డీవో రాజేంద్రకుమార్, ఆర్​టీవో ఉమామహేశ్వర్​రావు, ట్రాఫిక్​ ఏసీపీ నారాయణ, డీఎంహెచ్​వో డాక్టర్​ రాజశ్రీ తదితరులు పాల్గొన్నారు.