మధ్యాహ్న భోజనంలో నాణ్యత పాటించాలి : కలెక్టర్​ రాజీవ్​గాంధీ

నిజామాబాద్​/ ధర్పల్లి వెలుగు : సర్కారు హాస్టల్స్, స్కూల్స్​ పిల్లల భోజనాల విషయంలో ఎక్కడా రాజీపడమని కలెక్టర్ రాజీవ్​గాంధీ హనుమంతు అన్నారు. వంటలు చేయడానికి ముందే కూరగాయలు, వంట సరుకుల నాణ్యత పరిశీలించాలన్నారు. మంగళవారం ఆయన ధర్పల్లి మండల కేంద్రంలోని ప్రైమరీ, హైస్కూల్​ను సందర్శించి మాట్లాడారు.

భోజనాలను ప్రతీరోజూ తనిఖీ చేయాలని, టీచర్లు వంతుల వారీగా ఈ బాధ్యతలు నిర్వర్తించాలని ఆదేశించారు. బియ్యం, కూరగాయలు, వంట సరుకులు క్వాలిటీగా లేకుంటే తహసీల్దార్లకు తెలపాలన్నారు.  అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల నుంచి కొత్త ప్రతిపాదనలు ఉంటే పంపాలన్నారు. 

ధాన్యం కొనుగోలైన వెంటనే చెల్లింపులు​

ప్రభుత్వం ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో  ధాన్యం అమ్మిన వెంటనే రైతుల వివరాలు ట్యాబ్​లో ఎంట్రీ చేయాలని కలెక్టర్ ఆదేశించారు.  ధర్పల్లి మండలంలోని రామడుగు ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి  రైతులతో మాట్లాడారు.   ఇప్పటి వరకు సేకరించిన ధాన్యానికి బోనస్​తో సహా చెల్లించామన్నారు.