మంత్రి జూపల్లికి కలెక్టర్​ స్వాగతం

నిజామాబాద్ సిటీ, వెలుగు : నిజామాబాద్ నగరంలో వివిధ కార్యక్రమాలలో పాల్గొనేందుకు జిల్లా ఇన్​చార్జి మంత్రి, రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుకు కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, నగరపాలక సంస్థ కమిషనర్ ఎం.మకరంద్  సోమవారం స్వాగతం పలికారు. గెస్ట్ హౌస్ లో మంత్రితోపాటు ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ

ఎమ్మెల్యేలు పి.సుదర్శన్ రెడ్డి, డాక్టర్ ఆర్.భూపతి రెడ్డి, ఎమ్మెల్సీ మహేశ్​కుమార్ గౌడ్ లతో కలెక్టర్, కమిషనర్ భేటీ అయ్యి పలు అంశాలపై చర్చించారు.  అంతకముందు మంత్రి పోలీసుల  గౌరవ వందనం స్వీకరించారు. మంత్రి వెంట రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి తదితరులు ఉన్నారు.