ఈవీఎం గోడౌన్ సందర్శన

నిజామాబాద్ సిటీ, వెలుగు: జిల్లా కేంద్రంలోని వినాయకనగర్ లో గల ఈవీఎం గోడౌన్ ను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సోమవారం సందర్శించారు.  గోడౌన్లో భద్రపరిచిన బ్యాలెట్ యూనిట్లు, కంట్రోల్ యూనిట్లు, వీవీ ప్యాట్లు, ఇతర ఎన్నికల సామగ్రి వివరాలు తెలుసుకున్నారు.  పోలీసు బందోబస్తు  పరిశీలించి సలు సూచనలు చేశారు.  కలెక్టర్ వెంట ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు పవన్, సాత్విక్, అగ్నిమాపక కేంద్రం అధికారి నర్సింగ్ రావు తదితరులు ఉన్నారు.