మెనూ ప్రకారం స్టూడెంట్స్​కు భోజనం అందించాలి : కలెక్టర్​ రాజీవ్​ గాంధీ హన్మంతు

ఆర్మూర్, వెలుగు : ప్రభుత్వ స్కూల్స్, హాస్టల్స్ స్టూడెంట్స్​కు మెనూ ప్రకారంగా భోజనం అందించాలని  కలెక్టర్ రాజీవ్​ గాంధీ హన్మంతు ఆదేశించారు. ఆర్మూర్​ మున్సిపల్ పరిధిలోని పెర్కిట్  కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. డార్మెటరీ, స్టోర్ రూమ్, కిచెన్, ప్లే గ్రౌండ్ ను పరిశీలించారు. స్టోర్ రూమ్ లో నిల్వ ఉంచిన సన్నబియ్యం, ఇతర సరుకుల నాణ్యతను, వండిన మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి, మెనూ పై ఆరా తీశారు.  

భోజనం తయారు చేసేందుకు వినియోగించే ఆహార పదార్థాలు, సరుకులు, కూరగాయలు కలుషితం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.  విజయ వంటనూనె,  పాలను వినియోగించాలని చెప్పారు. స్టూడెంట్స్​కు ఆరోగ్య పరీక్షలు చేయించాలని సూచించారు. కలెక్టర్ వెంట ఆర్మూర్ ఆర్డీవో  రాజాగౌడ్ ఉన్నారు.