సమస్యలు పరిష్కరించాలి : కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు

నిజామాబాద్ సిటీ, వెలుగు : ప్రజావాణిలో ప్రజలు అందజేసిన దరఖాస్తులను వెంటనే పరిశీలించి పరిష్కరించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్​లో  సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో 82 మంది అర్జీలు అందజేశారు. కలెక్టర్, అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, ట్రైనీ కలెక్టర్ సంకేత్ కుమార్, డీఆర్డీఓ సాయాగౌడ్ అర్జీలు స్వీకరించారు.  సమస్యలను సత్వరమే పరిష్కరించాలని అధికారులను కలెక్టర్​ ఆదేశించారు.   

కామారెడ్డిలో 65 ఫిర్యాదులు

కామారెడ్డి టౌన్, వెలుగు : కామారెడ్డి కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో 65 మంది దరఖాస్తులు అందజేశారు. కలెక్టర్ ఆశిశ్​సంగ్వాన్​ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఫిర్యాదులను పరిశీలించి పరిష్కరించాలని ఆయా శాఖల ఆఫీసర్లను ఆదేశించారు.  జడ్పీ సీఈవో చందర్, డీఆర్​డీవో సురేందర్, వివిధ శాఖల ఆఫీసర్లు పాల్గొన్నారు.

కంట్రోల్​ రూమ్​ఏర్పాటు

వడ్ల కొనుగోలు సెంటర్ల సమస్యలపై ఫిర్యాదు చేయటానికి కామారెడ్డి కలెక్టరేట్లో కంట్రోల్​ రూమ్​ ఏర్పాటు చేశారు.  కంట్రోల్​రూమ్​ను సోమవారం కలెక్టర్​ప్రారంభించారు. సమస్యలపై 08468-220051కు ఫిర్యాదు చేయాలని సూచించారు.