పారదర్శకంగా ఓటర్​ లిస్టు : కలెక్టర్​ రాజీవ్​గాంధీ

నిజామాబాద్, వెలుగు: తప్పులులేకుండా పారదర్శకంగా ఓటర్​ లిస్టు రూపొందించేందుకు  పొలిటికల్ పార్టీలు సహకరించాలని కలెక్టర్ రాజీవ్​గాంధీ హనుమంతు కోరారు. కలెక్టరేట్​లో బుధవారం నిర్వహించిన మీటింగ్​లో మాట్లాడారు. బీఎల్​వోలు ప్రతీ ఇంటికి వెళ్లి  ఓటర్లపేర్లను పరిశీలించి నిర్ధారిస్తారని, అక్టోబర్​ 29న ప్రకటించనున్న డ్రాఫ్ట్ ను పొలిటికల్ ​లీడర్లు వాటిని పరిశీలించాలన్నారు. అభ్యంతరాలు తెలిపితే సరిచేయడానికి వీలుంటుందన్నారు. ఎమ్మెల్యే, ఎంపీ, మాజీ ప్రజాప్రతినిధుల పేర్లను చెక్​ చేయాలన్నారు.

2025  జనవరి1 నాటికి 18 ఏండ్లు నిండిన యువతీయువకులు తప్పనిసరిగా ఓటర్​గా నమోదయ్యేలా చూడాలన్నారు. కొత్త పోలింగ్ సెంటర్లు ఏర్పాటు చేయాలని  సూచించాలని కోరారు. సమావేశంలో ఎలక్షన్​ వింగ్​సూపరింటెండెంట్​పవన్​, సాత్విక్​ పాల్గొన్నారు.