గణేశ్​​ నిమజ్జన ఏర్పాట్లపై సమీక్ష : కలెక్టర్ రాజీవ్ ​గాంధీ

నిజామాబాద్, వెలుగు: వినాయక నిమజ్జన శోభాయాత్రకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్​ రాజీవ్​గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన పలు శాఖల ఆఫీసర్లతో సమీక్ష నిర్వహించారు. నగరంలోని దుబ్బ ఏరియా నుంచి సార్వజనిక్​ గణేశ్​​ మండలి శోభాయాత్ర ప్రారంభమవుతుందన్నారు.  భారీ విగ్రహాలన్నీ బాసర సమీపంలోని గోదావరిలో నిమజ్జనం చేస్తారన్నారు. యాత్ర కొనసాగే రోడ్ల రిపేర్​లను యుద్ధప్రతిపాదికన చేయాలన్నారు.   నిమజ్జన పాయింట్ల వద్ద క్రేన్లతో పాటు గజ ఈతగాళ్లను అందుబాటులో  ఉంచాలని సూచించారు.  జిల్లా కేంద్రంతో పాటు ఆర్మూర్​, బోధన్​ పట్టణాల్లోని సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి లా అండ్​ఆర్డర్​ సమస్య ఉత్పన్నం కాకుండా చూడాలన్నారు. 

అల్లర్లు చేస్తే కఠిన చర్యలు

మిలాద్–-ఉన్‌‌‌‌-నబీ, గణేశ్​ ఉత్సవాలు ఒకేసారి వచ్చినందున అలర్ట్​గా ఉండాలని మాజీ మంత్రి, బోధన్​ ఎమ్మెల్యే సుదర్శన్​రెడ్డి సూచించారు.  అల్లర్లు చేసే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామన్నారు. సీపీ కల్మేశ్వర్, నగర పాలక కమిషనర్ మంద మకరంద్, బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో, అదనపు డీసీపీ కోటేశ్వర్రావు తదితరులు పాల్గొన్నారు.