ఇందిరమ్మ ఇండ్ల మంజూరుకు సర్వే : కలెక్టర్​ రాజీవ్​గాంధీ

నిజామాబాద్​/ జక్రాన్​పల్లి, వెలుగు: ఇందిరమ్మ ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారు అర్హులా? కాదా? నిర్ధారించేందుకు చేపట్టిన పైలెట్​ సర్వేను శనివారం కలెక్టర్​ రాజీవ్​గాంధీ హనుమంతు పరిశీలించారు.  దరఖాస్తులను పరిశీలించి  జక్రాన్​పల్లి మండలం మాదాపూర్ లో  గ్రౌండ్​ విజిట్​ చేశారు.

దరఖాస్తుదారులు సొంత జాగా కలిగి ఉన్నారా? ప్రస్తుతం ఎవరి ఇంట్లో  నివాసం ఉంటున్నారు? అద్దె ఇంటి ఓనర్ ఎవరు? పెంకుటిల్లా?​ డాబా ఇళ్లా తదితర వివరాలు సేకరించి అప్​లోడ్​  చేయాలని పంచాయతీ సిబ్బందికి సూచించారు. అర్హులు మాత్రమే ఇంటి స్కీం లబ్ధి పొందేలా రిపోర్టు అందించాలని 
కోరారు.

హాస్టల్స్​ పరిశీలన 

సర్కారు హాస్టల్స్​లో ఉంటూ చదువుకునే పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని సిబ్బందికి కలెక్టర్ సూచించారు.  జక్రాన్​పల్లి మండలంలోని కేజీబీవీ గర్ల్స్​హాస్టల్​ను సందర్శించి పలు సూచనలు చేశారు.  సమస్యలను తహసీల్దార్ల దృష్టికి తీసుకెళ్లాలన్నారు. 

కొత్త ఓటర్ల నమోదు ​

గ్రామ పంచాయతీలలో కొనసాగుతున్న ఓటర్​ లిస్టు సవరణ ప్రత్యేక కార్యక్రమాన్ని మాదాపూర్​లో కలెక్టర్​ పరిశీలించారు.  మరణించిన ఓటరు​ పేరును లిస్టు నుంచి తొలగించాలని, కొత్త ఓటర్లను చేర్చడానికి వారు దరఖాస్తులో తెలిపిన ఇళ్లకు వెళ్లి నిర్ధారణ చేసుకోవాలన్నారు.  ఆయన వెంట ఆర్మూర్​ ఆర్డీవో రాజాగౌడ్​  ఉన్నారు.