ప్రభుత్వ స్కీములను సద్వినియోగం చేసుకోవాలి : కలెక్టర్ పమేలాసత్పతి

కరీంనగర్ టౌన్,వెలుగు: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెడుతున్న ఉపాధి కల్పన, నైపుణ్యాల పెంపు స్కీములను యువత సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్  పమేలాసత్పతి సూచించారు. బుధవారం కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌లో స్కిల్​ డెవలప్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై రివ్యూ మీటింగ్‌‌‌‌‌‌‌‌  నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మాట్లాడుతూ జిల్లాలో డిమాండ్‌‌‌‌‌‌‌‌ ఉన్న రంగాల్లో యువతకు నైపుణ్యాలు పెంచి, ఉపాధి కల్పనకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. గ్రామాల్లో డీఆర్డీఏ, పట్టణాల్లో మెప్మా ఆధ్వర్యంలో ఇంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, డిగ్రీ పూర్తిచేసిన యువతకు అప్రెంటీస్‌‌‌‌‌‌‌‌షిప్ అవకాశం కల్పించాలన్నారు. 

కార్పెంటర్, ఎలక్ట్రీషియన్, ప్లంబర్, మిల్క్ టెస్టర్, బాయిలర్ ఫామ్ సూపర్ వైజర్, బ్యూటీషియన్,  ఫుడ్ ప్రొడక్ట్స్, ఎలక్ట్రానిక్స్‌‌‌‌‌‌‌‌, టూరిజం, హాస్పిటాలిటీ విభాగాల్లో శిక్షణ ఇవ్వాలన్నారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్‌‌‌‌‌‌‌‌దేశాయ్‌‌‌‌‌‌‌‌, ట్రైనీ కలెక్టర్ అజయ్ కుమార్, మున్సిపల్  కమిషనర్ చాహత్  బాజ్‌‌‌‌‌‌‌‌పాయ్‌‌‌‌‌‌‌‌, మెప్మా పీడీ స్వరూపరాణి, ఎంప్లాయ్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తిరుపతిరావు, ఇండస్ట్రియల్  మేనేజర్​ నవీన్, పాల్గొన్నారు.