కరీంనగర్ కళాభారతిని గొప్పగా తీర్చిదిద్దుకుందాం : కలెక్టర్ పమేలాసత్పతి

  • ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆదేశాలు

కరీంనగర్ టౌన్, వెలుగు: కరీంనగర్  కళాభారతిని రాష్ట్రంలోనే అత్యుత్తమంగా తీర్చిదిద్దుదామని కలెక్టర్ పమేలాసత్పతి  అన్నారు.  శుక్రవారం స్థానిక  మున్సిపల్ ఆఫీస్ ఆవరణలోని  కళాభారతిని సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె  మాట్లాడుతూ కరీంనగర్ కళాకారులకు పుట్టినిల్లు అని గుర్తు చేశారు. కళాభారతిని తీర్చిదిద్దేందుకు ప్రతిపాదనలు రెడీ చేయాలని  ఆఫీసర్లను ఆదేశించారు.  

చాలాఏళ్లుగా కళలకు, కళాకారులకు సేవలందిస్తోన్న కళాభారతిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. సీటింగ్, కరెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, గ్రీన్ రూమ్, లైటింగ్ వ్యవస్థతో పాటు టెక్నికల్ అంశాల కల్పనకు నిపుణులతో చర్చించి ఆధునీకరిస్తామని  వివరించారు. అంతకుముందు ఉపాధి హామీ కింద స్కూళ్లలో చేపట్టిన పనులు డిసెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లోపు పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఎంఈవోలు, ఇంజినీరింగ్ అధికారులతో స్కూళ్లలో పనులపై రివ్యూ మీటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నిర్వహించారు. ఆయా కార్యక్రమాల్లో మున్సిపల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కమిషనర్ చాహత్ బాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పాయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, ట్రైనీ కలెక్టర్ అజయ్ యాదవ్, పంచాయతీరాజ్​ఈఈ చంద్రశేఖర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాల్గొన్నారు. 

కొత్తపల్లి, వెలుగు: మహిళల సమస్యలకు పరిష్కార వేదికగా శుక్రవారం సభ నిలుస్తుందని కలెక్టర్​ పమేలా సత్పతి అన్నారు. శుక్రవారం కొత్తపల్లి మండలం నాగులమల్యాల  ప్రైమరీ స్కూల్​లో నిర్వహించిన శుక్రవారం సభకు కలెక్టర్ ముఖ్య​అతిథిగా హాజరయ్యారు. మహిళలు తమకు ఏ సమస్యలున్నా శుక్రవారం సభలో చెప్పుకోవచ్చన్నారు. సభ అనంతరం దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. సంక్షేమ అధికారి ఎం.సరస్వతి, ఆర్డీవో మహేశ్వర్, తహశీల్దార్​ రాజేశ్​, ఎంపీడీవో సంజీవ్​రావు, జీపీ స్పెషల్ ఆఫీసర్​ నవీన్​కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, జిల్లా సీడీపీవో సబిత, మెడికల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సుజాత పాల్గొన్నారు.