బాలికలు స్ఫూర్తిగా నిలవాలి : కలెక్టర్ పమేలా సత్పతి

  • కరీంనగర్  కలెక్టర్ పమేలా సత్పతి 

కరీంనగర్ టౌన్, వెలుగు:  ప్రతి బాలిక మరొకరికి స్ఫూర్తిదాయకం కావాలని కలెక్టర్ పమేలాసత్పతి అన్నారు. ఈనెల 11న అంతర్జాతీయ బాలికా దినోత్సవ వేడుకలు నిర్వహించాల్సి ఉండగా.. దసరాసెలవులు కావడంతో శనివారం మహిళాభివృద్ది,శిశు సంక్షేమ  ఆధ్వర్యంలో  స్థానిక కలెక్టరేట్ లో ఈ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పమేలాసత్పతి మాట్లాడుతూ... బాలికలు ఒక నిర్దిష్ట లక్ష్యంతో ధైర్యంగా ముందుకు సాగాలన్నారు. 

మహిళలు అంతరిక్షంలోకి వెళుతున్నారని గర్వంగా చెప్పుకుంటున్న ఈ రోజుల్లో బ్రూణ హత్యలు జరగడం బాధాకరమన్నారు. ప్రతి రంగంలో మహిళలు ఉన్నప్పటికీ వారి పట్ల సమాజంలో చిన్నచూపు ఇంకా తగ్గలేదని  గుర్తు చేశారు.  యుక్త వయసు రాగానే బాలికకు సమాజం పట్ల భయాన్ని నూరిపోస్తున్నామని తెలిపారు. చదవడం ఒక్కటే ఎదగడానికి మార్గమన్నారు. మహిళలకు సానుభూతి అవసరం లేదని సాహసంతో ముందుకు సాగాలని సూచించారు. బాలుడికి ఇచ్చే ప్రోత్సాహాన్ని, అవకాశాన్ని బాలికలకు కూడా ఇవ్వాలని తల్లిదండ్రులను కోరారు.

తల్లికి మించిన దైవం లేదని ఏ సమస్య వచ్చినా తల్లికి చెప్పాలని, ఆమె మాటలు వినాలని విద్యార్థులకు సూచించారు. బాలికల కల్చరర్ ప్రోగ్రామ్స్ ,యోగ,జిమ్నాస్టిక్స్ అలరించాయి. కార్యక్రమంలో అడిషనల్  కలెక్టర్  ప్రపుల్ దేశాయ్, ఏసీపీ మాధవి, డీఎంహెచ్‌‌‌‌‌‌‌‌వో డాక్టర్ సుజాత, డీడబ్ల్యువో సరస్వతి, తదితరులు 
పాల్గొన్నారు.