టెన్త్​లో 100 శాతం రిజల్ట్ సాధించాలి : కలెక్టర్ పమేలాసత్పతి

కరీంనగర్ టౌన్, వెలుగు: టెన్త్‌‌‌‌‌‌‌‌లో 100 శాతం ఉత్తీర్ణత సాధించేందుకు ప్రతి విద్యార్థిపై టీచర్లు దృష్టి పెట్టాలని కలెక్టర్ పమేలాసత్పతి ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌లో హెచ్‌‌‌‌‌‌‌‌ఎంలతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ 100 శాతం రిజల్ట్‌‌‌‌‌‌‌‌ సాధించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలన్నారు. జిల్లాలో 23,316 మంది విద్యార్థులకు బూట్లు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, ట్రైనీ కలెక్టర్ అజయ్ యాదవ్, డీఈవో జనార్ధన్‌‌‌‌‌‌‌‌రావు, ఎగ్జామినేషన్ ఇన్‌‌‌‌‌‌‌‌చార్జి స్వామి పాల్గొన్నారు.  

చిగురుమామిడి: ప్రతి మహిళ ఆరోగ్యంగా ఉండాలని, అందుకు ప్రభుత్వ వైద్య సేవలను వినియోగించుకోవాలని కలెక్టర్​ పమేలా సత్పతి సూచించారు. మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం చిగురుమామిడి మండలం చిన్నముల్కనూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ‘ఫ్రైడే మీటింగ్‌‌‌‌‌‌‌‌’ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మాట్లాడుతూ రూ.45 వేల విలువైన 50 రకాల టెస్ట్‌‌‌‌‌‌‌‌లు ‘ఆరోగ్య మహిళా క్లినిక్’లలో ప్రభుత్వం ఉచితంగా చేయిస్తోందన్నారు. 

స్పోర్ట్స్ స్కూల్ కు రూ.25 లక్షలు విడుదల 

కరీంనగర్ సిటీ: కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్పోర్ట్స్‌‌‌‌‌‌‌‌ స్కూల్‌‌‌‌‌‌‌‌కు రూ.25లక్షలు విడుదల చేస్తూ కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిధులు మంత్రి పొన్నం ప్రభాకర్ నియోజకవర్గ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్స్ నుంచి మంజూరు చేసినట్లు కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పేర్కొన్నారు.