ప్రైవేట్​ హాస్పిటల్స్ రూల్స్ పాటించాలి : కలెక్టర్  పమేలాసత్పతి

కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టౌన్, వెలుగు: ప్రైవేట్ ఆస్పత్రులన్నీ రూల్స్​ పాటించాలని, లేకుంటే చర్యలు తప్పవని   కలెక్టర్  పమేలాసత్పతి  హెచ్చరించారు.  శనివారం కలెక్టరేట్ లో  జిల్లా రిజిస్ట్రేషన్ అథారిటీ(డీఆర్ఏ) ఆధ్వర్యంలో క్లినికల్ ఎస్టాబ్లిష్ మెంట్  యాక్ట్ పై  సీపీ అభిషేక్ మహంతి, ఐఎంఏ జిల్లా అధ్యక్షుడు నరేశ్ తో కలిసి  కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్​ నిర్వహించారు.  జిల్లాలోని ప్రతీ హాస్పిటల్ లో రిసెప్షన్ సెంటర్ వద్ద వైద్యసేవల వివరాలు, చార్జీలు, వైద్యుల వివరాలతో కూడిన నోటీస్​  బోర్డు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

 5కంటే ఎక్కువ బెడ్లు ఉన్న ప్రతీ ఆసుపత్రిలో  పార్కింగ్ సౌకర్యం ఏర్పాటు చేయాలని ఆదేశించారు. 50 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తు ఉన్న భవనాలకు అగ్నిమాపక శాఖ నుంచి ఎన్ఓసీ తీసుకోవాలన్నారు.  అనంతరం  సెప్టెంబర్25న  వరంగల్ లో జరిగిన అండర్14 ఎస్జీఎఫ్​ జూడో  కాంపిటీషన్లలో గోల్డ్ మెడల్స్ సాధించిన ఆరుగురు  స్టూడెంట్లను అభినందించారు.  ఈ సమావేశంలో అడిషనల్ కలెక్టర్లు ప్రపుల్ దేశాయ్, లక్ష్మికిరణ్, మున్సిపల్  కమిషనర్  చాహత్  బాజ్ పాయ్, డీఎంహెచ్ఒ డా.సుజాత, ట్రైనీ  కలెక్టర్ అజయ్ కుమార్  జాదవ్, స్పోర్ట్స్  ఆఫీసర్  శ్రీనివాస్ గౌడ్  పాల్గొన్నారు.