ప్రభుత్వ స్కూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విద్యార్థులు ప్రపంచవేదికపై మాట్లాడాలి : కలెక్టర్ పమేలా సత్పతి

కరీంనగర్, వెలుగు: ప్రభుత్వ స్కూళ్లలో చదువుతున్న విద్యార్థులు ప్రపంచ వేదికపై ప్రసంగించేలా తయారు కావాలని, ఆ దిశగా ప్రయత్నాలు కొనసాగించాలని కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కలెక్టర్ పమేలా సత్పతి ఆకాంక్షించారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను టీఈడీ స్టూడెంట్స్ టాక్ కార్యక్రమానికి పంపేందుకుగానూ జిల్లా స్థాయి సెలక్షన్స్ మంగళవారం ఓ ప్రైవేట్ స్కూల్ లో నిర్వహించారు.

జిల్లాలోని 176 ప్రభుత్వ స్కూళ్లకు చెందిన 345 మంది విద్యార్థులు పోటీల్లో పాల్గొనగా 40 మంది ఎంపికై శిక్షణ పూర్తి చేసుకున్నారు. వారి నుంచి ఇద్దరిని ఎంపిక చేసి ప్రపంచస్థాయి టెడ్ ఎడ్ ఉపన్యాసానికి పంపించనున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ శిక్షణ ప్రభుత్వ విద్యార్థులకు భవిష్యత్ లో మంచి మార్గం చూపుతుందన్నారు. కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ అజయ్ యాదవ్, డీఈఓ జనార్దన్ రావు తదితరులు పాల్గొన్నారు.