పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి : కలెక్టర్​ పమేలా సత్పతి

హుజూరాబాద్/ హుజూరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రూరల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు: హాస్టళ్లలో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కలెక్టర్​ పమేలా సత్పతి సూచించారు.  శుక్రవారం హుజూరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పట్టణంలోని ఎస్సీ బాలికల, కేసీ క్యాంప్ లోని బీసీ బాలికల హాస్టళ్లను ఆమె సందర్శించారు.  ఈ సందర్భంగా కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హాస్టల్ గదులను పరిశీలించారు. మెనూ ప్రకారం స్టూడెంట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఆహారం ఇస్తున్నారా అని ఆరా తీశారు. ఇతర వసతులపై వార్డెన్లను అడిగి తెలుసుకున్నారు. అంతకుముందు హుజూరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మండలం పెద్దపాపయ్యపల్లి జీపీ ఆవరణలో శుక్రవారం పోషణ మాసోత్సవం, శుక్రవారం సభ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రైవేట్ కు దీటుగా అంగన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వాడీల్లో చక్కటి బోధన ఉంటుందన్నారు. ప్రతి గర్భిణి ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచితంగా వైద్య పరీక్షలు చేయించుకోవాలన్నారు. అనంతరం గర్భిణులకు సీమంతం నిర్వహించారు.  కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వెంట అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయి, ఆర్డీవో రమేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బాబు, సిబ్బంది ఉన్నారు.