మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి 

  •     కలెక్టర్ పమేలా సత్పతి

కరీంనగర్ టౌన్, వెలుగు : ప్రభుత్వం తీసుకొచ్చిన ఇందిరా మహిళా శక్తి ప్రోగ్రామ్‌‌‌‌‌‌‌‌ను వినియోగించుకొని గ్రామీణ మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని కలెక్టర్ పమేలాసత్పతి అన్నారు. గురువారం కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌లో ఇందిరా శక్తి అమలుపై వివిధ శాఖల అధికారులతో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మాట్లాడుతూ మహిళలు వ్యాపారం ప్రారంభించే ముందు తమ  వద్ద ఉత్పత్తయ్యే వస్తువుల మార్కెటింగ్‌‌‌‌‌‌‌‌పై అవగాహన పెంచుకోవాలన్నారు.

మహిళా సంఘాల ఆధ్వర్యంలో నడుస్తున్న అమ్మ ఆదర్శ స్కూల్ పనులు  85శాతం పూర్తయ్యాయన్నారు. అనంతరం వనమహోత్సవ రివ్యూ మీటింగ్‌‌‌‌‌‌‌‌ నిర్వహించారు. అనంతరం శిశుగృహ శిశువును  పిల్లల్లేని  దంపతులకు దత్తత ఉత్తర్వులు ఇచ్చారు.

సమావేశంలో అడిషనల్ కలెక్టర్లు ప్రఫుల్ దేశాయ్, లక్ష్మీకిరణ్​, ఆర్డీవోలు మహేశ్వర్, రమేశ్ బాబు, డీఆర్డీవో పీడీ శ్రీనివాస్, జడ్పీ సీఈవో శ్రీనివాస్,  డీఎంహెచ్‌‌‌‌‌‌‌‌వో డా.సుజాత, ఎల్డీఎం ఆంజనేయులు, ఇండస్ట్రియల్ ఎస్టేట్ జీఎం నవీన్ కుమార్, పాల్గొన్నారు.