తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ : కలెక్టర్ పమేలా సత్పతి

  • వివిధ శాఖల ఆధ్వర్యంలో వేడుకలు 

కరీంనగర్  టౌన్, వెలుగు:  తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ అని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు.  బుధవారం స్థానిక మహాత్మా జ్యోతిబా పూలే  మైదానంలో మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ, మెప్మా, నగరపాలక సంస్థ, డీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డీవో, రెవెన్యూ, సీపీవో, జడ్పీ.. పలు శాఖల ఆధ్వర్యంలో  నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో మేయర్ సునీల్ రావుతో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పూలను దేవతలుగా పూజించే గొప్ప సంప్రదాయం బతుకమ్మ  సొంతమన్నారు.

అనంతరం బతుకమ్మలను అందంగా తీర్చిదిద్దిన శాఖలకు బహుమతులు అందజేశారు. కలెక్టర్ మహిళలతో కలిసి బతుకమ్మ ఆడిపాడారు. 
రాయికల్​, వెలుగు: జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణంలోని మండల పరిషత్ ఆఫీస్‌‌‌‌‌‌‌‌లో మహిళా ఉద్యోగులు సిబ్బంది బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. జీపీ సెక్రటరీలు, వివిధ మహిళా సంఘాల ప్రతినిధులు, అధికారులు ఆడిపాడారు. కార్యక్రమంలో తహసీల్దార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అబ్దుల్ ఖయ్యాం, పీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఏఈ ప్రసాద్, ఎంపీవో సుష్మా, ఏపీవో శ్రీనివాస్​చక్రవర్తి, తదితరులు పాల్గొన్నారు

 హుజూరాబాద్ కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ ఆఫీస్‌‌‌‌‌‌‌‌లో.. 

హుజురాబాద్ వెలుగు: హుజూరాబాద్‌‌‌‌‌‌‌‌ కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ ఆఫీస్‌‌‌‌‌‌‌‌లో పార్టీ మహిళా కార్యకర్తలు, లీడర్లు బుధవారం బతుకమ్మ సంబురాలు నిర్వహించారు. మహిళలు భారీగా పాల్గొని ఆడి పాడారు.