గ్రూప్ 3 ఎగ్జామ్‌‌‌‌‌‌‌‌కు ఏర్పాట్లు పూర్తి : కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పమేలా సత్పతి

కరీంనగర్ టౌన్, వెలుగు: ఈ నెల 17, 18 తేదీల్లో నిర్వహించబోయే గ్రూప్-3 పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పమేలా సత్పతి తెలిపారు. గ్రూప్‌‌‌‌‌‌‌‌ 3 పరీక్షల కోసం జడ్పీ ఆఫీస్‌‌‌‌‌‌‌‌లో ఏర్పాటు చేయబోయే స్ట్రాంగ్‌‌‌‌‌‌‌‌ రూంను పోలీసులు, అధికారులతో కలిసి కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పరిశీలించారు. 

స్ట్రాంగ్ రూమ్ ఏర్పాట్లపై అధికారులను ఆరా తీశారు. ఆమె వెంట అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, ఆర్డీవో మహేశ్వర్ ఉన్నారు.