నవంబర్ 1న జిల్లాలో బీసీ కమిషన్ పర్యటన : పమేలాసత్పతి

  • కలెక్టర్ పమేలాసత్పతి

కరీంనగర్ టౌన్, వెలుగు: బీసీ కులాల అభివృద్ధి, సామాజిక రాజకీయ, ఆర్థిక విశ్లేషణ చేసేందుకు రాష్ట్ర బీసీ కమిషన్ నవంబర్ 1న కరీంనగర్‌‌‌‌లో పర్యటించనున్నట్లు కలెక్టర్ పమేలాసత్పతి తెలిపారు. బుధవారం కలెక్టరేట్‌‌లో అధికారులతో రివ్యూ మీటింగ్‌‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలోని వివిధ సామాజికవర్గాల ప్రజలు , ప్రజాప్రతినిధులు తమ అభిప్రాయాలను రాతపూర్వకంగా బీసీ కమిషన్‌‌కు అందజేయవచ్చాన్నారు. అంతకుముందు సివిల్‌‌ సప్లై ఆఫీసర్లు, వడ్ల కొనుగోలు ఏజెన్సీలు, రైస్‌‌ మిల్లర్లతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు.

 రైతులకు ధాన్యం డబ్బుల చెల్లింపులో జాప్యం లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. మిల్లులకు సరఫరా చేసే ధాన్యానికి బ్యాంకు గ్యారంటీ, సెక్యూరిటీ డిపాజిట్ తప్పనిసరి  అన్నారు. ఈ మేరకు  ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. అనంతరం ప్రైవేట్ స్కూళ్ల మేనేజ్‌‌మెంట్లతో సమావేశమయ్యారు.

 ఆయా సమావేశాల్లో అడిషనల్  కలెక్టర్లు ప్రఫుల్‌‌దేశాయ్, లక్ష్మీకిరణ్, ట్రైనీ  కలెక్టర్ అజయ్ యాదవ్, సైన్స్ ఆఫీసర్ జైపాల్ రెడ్డి, అల్ఫోర్స్ చైర్మన్ నరేందర్ రెడ్డి,  ట్రస్మా మాజీ చైర్మన్ యాదగిరి శేఖర్ రావు, సివిల్ సప్లై డీఎం రజనీకాంత్, డీఎస్‌‌వో నర్సింగ రావు, డీసీవో రామానుజాచారి,  బాయిల్డ్ రైస్ మిల్లర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు నర్సింగారావు, ఉపాధ్యక్షుడు అశోక్ రావు, రా రైస్ మిల్లుల సంఘం జిల్లా అధ్యక్షుడు సురేశ్‌‌, ఉపాధ్యక్షుడు సంతోష్ రెడ్డి పాల్గొన్నారు.