సీఎం కప్‌‌‌‌‌‌‌‌తో గ్రామీణ క్రీడాకారులకు ప్రోత్సాహం : కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పమేలా సత్పతి

  • కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చేరిన క్రీడా జ్యోతి 

కరీంనగర్  టౌన్, వెలుగు: గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించేందుకే ప్రభుత్వం సీఎం కప్‌‌‌‌‌‌‌‌ పోటీలు నిర్వహిస్తోందని కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పమేలా సత్పతి అన్నారు.  సీఎం కప్ క్రీడాజ్యోతి ర్యాలీ బుధవారం కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చేరుకుంది. కమాన్ వద్ద కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, సీపీ అభిషేక్ మహంతి క్రీడాజ్యోతి ర్యాలీకి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  మాట్లాడుతూ సీఎం కప్ గురించి ప్రజల్లో అవగాహన కల్పించి పట్టణ, గ్రామీణ ప్రాంతాల నుంచి ఎక్కువ మంది  క్రీడాకారులు పాల్గొనేలా చేయడమే ర్యాలీ లక్ష్యమన్నారు. ర్యాలీ అల్గూనూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చౌరస్తా నుంచి కమాన్ మీదుగా అంబేద్కర్ స్టేడియం వరకు  సాగింది. 

కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్‌‌‌‌‌‌‌‌ దేశాయ్, మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్ పాయ్, డీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వో పవన్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఆర్డీవో మహేశ్వర్, సుడా చైర్మన్  నరేందర్ రెడ్డి,  యువజన  క్రీడల అధికారి శ్రీనివాస్ పాల్గొన్నారు.