ఖైదీల సంక్షేమానికి ప్రభుత్వం కృషి : కలెక్టర్ పమేలా సత్పతి

కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టౌన్, వెలుగు : జైలు శిక్ష అనుభవించి విడుదలైన వారిని సమాజం ఆదరించాలని, వారి పట్ల సానుభూతితో ఉండాలని కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పమేలా సత్పతి సూచించారు. బుధవారం గాంధీ జయంతి సందర్భంగా జైలులో నిర్వహించిన ఖైదీల సంక్షేమ దినోత్సవంలో జిల్లా జడ్జి ప్రతిమ, సీపీ అభిషేక్ మహంతితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఖైదీల సంక్షేమానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు.  

అంతకుముందు గాంధీ జయంతి సందర్భంగా కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మహాత్ముడి విగ్రహానికి నివాళులు అర్పించారు. ఆమె మాట్లాడుతూ ప్రపంచానికి అహింస, శాంతి సిద్ధాంతాలను బోధించిన గాంధీజీ ఆశయసాధనకు కృషి  చేయాలన్నారు. అనంతరం స్థానిక జిల్లా  గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ను సూపరింటెండెంట్ డా.వీరారెడ్డి, డీఎంహెచ్ఒ  డా.సుజాతతో కలిసి పరిశీలించారు. 

జగిత్యాల టౌన్, వెలుగు : గాంధీ జయంతి సందర్భంగా జగిత్యాల స్పెషల్ సబ్ జైల్ లో ఖైదీల సంక్షేమ దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లుగా అడిషనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జిల్లా జడ్జి నారాయణ, సీనియర్ సివిల్ జడ్జి, సెక్రటరీ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ప్రసాద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా జైలు పర్యవేక్షణాధికారి మొగిలేశ్​ మాట్లాడుతూ గాంధీజీ కలలు కన్న స్వరాజ్య స్థాపనకు ప్రతిఒక్కరూ కృషి  చేయాలన్నారు.