అంగారిక టౌన్​షిప్​ పనులు స్పీడప్ చేయాలి : కలెక్టర్ పమేలా సత్పతి

కరీంనగర్ టౌన్, వెలుగు: తిమ్మాపూర్ మండలం సుభాష్ నగర్ అంగారిక టౌన్ షిప్ లో మౌలిక వసతుల పనుల్లో వేగం పెంచి వెంటనే పూర్తి చేయాలని కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. కరీంనగర్​లో సుడా, మున్సిపల్ టౌన్ ప్లానింగ్, రెవెన్యూ అధికారులతో కలెక్టర్ శుక్రవారం సమీక్ష నిర్వహించారు. విద్యుత్తు, సీసీ రోడ్లు ఇతర పనులు వెంటనే పూర్తిచేయాలని ఆదేశించారు.

జాప్యం చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఈ పనులు పూర్తయిన తర్వాత మిగిలిపోయిన ప్లాట్లకు సంబంధించిన వేలం అంశంపై నిర్ణయం తీసుకుంటామన్నారు. ప్లాట్ల వివరాలను అధికారులు సిద్ధం చేసుకోవాలని చెప్పారు.