ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంచాలి ; కలెక్టర్ పమేలాసత్పతి

  • కలెక్టర్ పమేలాసత్పతి

కరీంనగర్ టౌన్, వెలుగు:  సిటీలోని  మాతా శిశు  కేంద్రాన్ని కలెక్టర్ పమేలాసత్పతి  శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. హాస్పిటల్‌‌‌‌‌‌‌‌కు వచ్చే తల్లీబిడ్డలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని  వైద్య అధికారులను ఆదేశించారు.  సమయపాలన పాటిస్తూ,  గర్భిణీలు,  బాలింతల వివరాలు పకడ్బందీగా నమోదు చేయాలన్నారు.  ఆరోగ్యశ్రీ,  గైనిక్ వార్డు,  ఏఎన్ సీ-2,  స్కానింగ్ రూమ్,  టిఫా స్కానింగ్ రూమ్,  ల్యాబ్,  లేబర్ రూమ్,  ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, మెటర్నటీ వార్డ్స్,  ఎస్ఎన్ సీయూ బ్లాక్ ను సందర్శించి,  ఆయా విభాగాల రిజిస్టర్లను తనిఖీ చేశారు.  

మెటర్నటీ వార్డులోని బాలింతలతో మాట్లాడి, వైద్యంలో ఇబ్బందులుంటే తనకు తెలియచేయాలని  సూచించారు.  ఇంక్యుబేటర్ చిన్నారులను  పరిశీలించారు.  ప్రసవాల సంఖ్యను పెంచాలని,  హైరిస్క్ గర్భిణులను జాయిన్ చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఇన్ చార్జి ఆర్ఎంఓ డాక్టర్ నవీన,  డీసీహెచ్ఎస్ డాక్టర్ చంద్రశేఖర్,  డా.నరేందర్   పాల్గొన్నారు.