కరీంనగర్ జిల్లాలోని పీహెచ్ సీల్లో డెలివరీలు పెంచాలి : కలెక్టర్ పమేలాసత్పతి

కరీంనగర్ టౌన్, వెలుగు: కరీంనగర్ జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రసవాల సంఖ్యను పెంచాలని  కలెక్టర్ పమేలాసత్పతి హెల్త్ ఆఫీసర్లను ఆదేశించారు. శనివారం  స్థానిక కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌లో  వైద్య, మెడికల్ ఆఫీసర్లతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ పమేలాసత్పతి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా  ఆమె  మాట్లాడుతూ... గర్భిణీల్లో రక్తహీనత నివారించాలన్నారు. మొత్తం ప్రసవాల్లో 20 శాతం ప్రసవాలు పీహెచ్  సీల్లో జరిగేలా చూడాలన్నారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్ ప్రపుల్ దేశాయి, ట్రైనీ కలెక్టర్ అజయ్ యాదవ్, డీఎంహెచ్ వో  డాక్టర్  వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.