ఆగస్టు 3 లోపు ఆవిష్కరణలు పంపాలి : కలెక్టర్ పమేలా సత్పతి

కరీంనగర్ టౌన్, వెలుగు: ఇంటింటా ఇన్నోవేటర్  ప్రోగ్రామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఆగస్టు 3లోపు ఆవిష్కరణలు పంపాలని కలెక్టర్ పమేలాసత్పతి పిలుపునిచ్చారు. మంగళవారం కలెక్టరేట్ లో నిర్వహించిన రివ్యూ మీటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఆమె మాట్లాడుతూ ఇన్నోవేటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రోగ్రామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కరీంనగర్ జిల్లాకు రాష్ట్రస్థాయిలో గుర్తింపు తీసుకురావాలన్నారు. గతేడాది జిల్లా నుంచి 100 ఆవిష్కరణలు వచ్చినట్లు, ఈ ఏడాది అంతకంటే ఎక్కువ రావాలని సూచించారు.

ఆవిష్కరణలకు సంబంధించిన 4 ఫొటోలు, 100 పదాలు, 2 నిమిషాల వీడియో, ఆవిష్కరణ పేరు, సెల్ నెంబరు, వృత్తి, పూర్తి వివరాలతో 9100678543  నంబర్ కు వాట్సాప్ ద్వారా పంపించాలన్నారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, డిస్ట్రిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జిల్లా సైన్స్ ఆఫీసర్  జైపాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, ఈడియం శ్రీరామ్, శ్రీనివాస్ రెడ్డి, ఇన్నోవేటర్ ప్రోగ్రామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జిల్లా కోఆర్డినేటర్ మణిదీప్ పాల్గొన్నారు.