ఆపరేషన్ ముస్కాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను పకడ్బందీగా నిర్వహించాలి 

కరీంనగర్ టౌన్, వెలుగు : ఈనెల 31వరకు చేపట్టనున్న ఆపరేషన్ ముస్కాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ పమేలాసత్పతి అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో స్త్రీ శిశు సంక్షేమ,  పోలీసు, కార్మిక  శాఖ ఆఫీసర్లతో రివ్యూ మీటింగ్​ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాలకార్మికులను పనిలో పెట్టుకుంటే  కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇంటి నుంచి తప్పిపోయిన, పారిపోయిన, భిక్షాటన చేసే 14 ఏళ్ల లోపు చిన్నారులను గుర్తించి తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వాలన్నారు.

అనంతరం ఆయా చిన్నారులను స్కూళ్లలో  చేర్పించాలని ఆదేశించారు. అంతకుముందు రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి ఈవీఎం గోదాంను  పరిశీలించారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్ లక్ష్మీకిరణ్​, ఆర్డీవో మహేశ్వర్, ఏవో సుధాకర్,  సీడబ్ల్యూసీ చైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పర్సన్ ధనలక్ష్మి,  డీడబ్ల్యూవో సరస్వతి,  కార్మికశాఖ డీసీ శామ్యూల్, బీసీడీవో అనిల్ ప్రకాశ్, రాజకీయ  పార్టీల ప్రతినిధులు  పాల్గొన్నారు.

ఆయిల్ ఫామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై రైతులు దృష్టి సారించాలి

ఆయిల్ ఫామ్ సాగుపై రైతులు దృష్టి  సారించాలని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉద్యానవన, వ్యవసాయ శాఖ అధికారులతో రివ్యూ మీటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 2,300 ఎకరాల్లో ఆయిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫామ్​ సాగుచేపట్టేలా రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్ధేశించిందన్నారు. జిల్లాలో ఇప్పటికే 1500 ఎకరాల్లో రైతులు ఆయిల్ ఫామ్ సాగవుతుందన్నారు. అనంతరం శిశుగృహలోని ముగ్గురు చిన్నారులను దత్తత ఇచ్చారు. కార్యక్రమంలో జిల్లా ఉద్యానవన శాఖ అధికారి బండారి శ్రీనివాస్, డీఏవో శ్రీనివాస్, ఏడీఏ రణధీర్ పాల్గొన్నారు.