హాస్టళ్లను మెరుగ్గా తీర్చిదిద్దాలి : కలెక్టర్ పమేలా సత్పతి

చొప్పదండి, వెలుగు: రెసిడెన్సియల్‌‌‌‌‌‌‌‌ స్కూల్స్‌‌‌‌‌‌‌‌, సోషల్‌‌‌‌‌‌‌‌ వెల్ఫేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హాస్టళ్లను అత్యుత్తమంగా తీర్చిదిద్దాలని కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. మంగళవారం చొప్పదండి మున్సిపాలిటీలోని ఎస్‌‌‌‌‌‌‌‌సీ గర్ల్స్‌‌‌‌‌‌‌‌ రెసిడెన్షియల్‌‌‌‌‌‌‌‌, బీసీ హాస్టల్‌‌‌‌‌‌‌‌ను అడిషనల్‌‌‌‌‌‌‌‌ కలెక్టర్ ప్రఫుల్‌‌‌‌‌‌‌‌ దేశాయ్​తో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా హాస్టల్‌‌‌‌‌‌‌‌ గదులను పరిశీలించారు. విద్యార్థులు సంఖ్య, విద్యా బోధన, హాస్టల్ పరిశుభ్రతపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం వంటగదిని తనిఖీ చేశారు.

 ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమం కోసం హాస్టళ్లను బలోపేతం చేస్తోందన్నారు. ఆ తర్వాత చొప్పదండి సీహెచ్‌‌‌‌‌‌‌‌సీని సందర్శించారు. అందుతున్న వైద్యసేవలు, ప్రతిరోజూ ఓపీ వివరాలను అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ వెంట డీఎంహెచ్‌‌‌‌‌‌‌‌వో సరస్వతి, తహసీల్దార్​ నవీన్​కుమార్​, ఎంపీడీవో వేణుగోపాల్​రావు, మున్సిపల్ కమిషనర్ నాగరాజు, ప్రిన్సిపాల్​ స్వాతి, వైద్యాధికారులు, సిబ్బంది ఉన్నారు.