ప్రజావాణి అప్లికేషన్లను వెంటనే పరిష్కరించాలి

కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టౌన్, వెలుగు: ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిశీలించి పరిష్కరించాలని కలెక్టర్ పమేలా సత్పతి  అధికారులను ఆదేశించారు. సోమవారం కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కలెక్టరేట్ లో  169 దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజావాణి అప్లికేషన్లు పెండింగ్‌‌‌‌‌‌‌‌లో ఉంచొద్దని ఆదేశించారు.  రెవెన్యూ, పెన్షన్, భూసమస్యలతో పాటు  ఇతర సమస్యల పరిష్కారం కోసం 169 వినతులు వచ్చినట్లు  వెల్లడించారు. కార్యక్రమంలో అడిషనల్  కలెక్టర్లు ప్రపుల్ దేశాయ్, లక్ష్మీకిరణ్‌‌‌‌‌‌‌‌, మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్‌‌‌‌‌‌‌‌పాయ్,  డీఎంహెచ్‌‌‌‌‌‌‌‌వో డా.సుజాత, పాల్గొన్నారు.

 జగిత్యాలలో 25 అప్లికేషన్లు 

జగిత్యాల టౌన్, వెలుగు: జగిత్యాల కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌లో నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి అడిషనల్ కలెక్టర్లు  పి.రాంబాబు, గౌతమ్ రెడ్డి స్వీకరించారు. ప్రజావాణికి 25 అప్లికేషన్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఆర్డీవోలు మధుసూధన్, శ్రీనివాస్, కలెక్టరేట్ ఏవో హన్మంతరావు, డీపీవో రఘు వరుణ్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

రాజన్న సిరిసిల్ల, వెలుగు: ప్రజావాణీ అర్జీల పరిష్కారంలో జాప్యం చేయొద్దని రాజన్నసిరిసిల్ల కలెక్టర్ సందీప్​కుమార్ ఝా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌లో ప్రజల నుంచి 82 అర్జీలు స్వీకరించారు. అనంతరం రెవెన్యూ శాఖ సమస్యలపై కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్‌‌‌‌‌‌‌‌ ద్వారా ఎంపీడీవోలు, తహసీల్దార్లతో రివ్యూ నిర్వహించారు.