చేనేత ఉత్పత్తులకు నేతన్నలే బ్రాండ్ అంబాసిడర్లు : పమేలా సత్పతి

కరీంనగర్, వెలుగు: చేనేత వస్త్రాల ప్రచారానికి నేతన్నలే బ్రాండ్ అంబాసిడర్లుగా నిలవాలని కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కలెక్టర్ పమేలా సత్పతి పిలుపునిచ్చారు. కలెక్టరేట్‌‌‌‌‌‌‌లో చేనేత, జౌళి శాఖ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన జాతీయ చేనేత దినోత్సవంలో కలెక్టర్‌‌‌ పాల్గొని మాట్లాడారు. ప్రతి సోమవారం కలెక్టరేట్ లో నిర్వహించే ప్రజావాణిలో చేనేత స్టాల్ ఏర్పాటుకు నేత కార్మికులు సుముఖంగా ఉంటే  అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం పర్చేస్ ఆర్డర్ ఇస్తుందని ఎదురుచూడకుండా మార్కెట్ కు అనుగుణంగా ఉత్పత్తి చేయాలని  సూచించారు. 

వ్యాసరచన, డ్రాయింగ్ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. చేనేత కార్మికులను సత్కరించారు. అలాగే కలెక్టరేట్ లో బ్యాంకర్లు , జిల్లా అధికారులతో రైతులు, మహిళా సంఘాలకు రుణాల పంపిణీపై బ్యాంక్ ఆఫీసర్లతో రివ్యూ నిర్వహించారు. డీసీసీబీ చైర్మన్ కోడూరు రవీందర్, మేయర్ వై. సునీల్ రావు, సుడా చైర్మన్  కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, హ్యాండ్లూమ్ ఏడీ చరణ్,  అడిషనల్ కమిషనర్ సువార్తా పాల్గొన్నారు.

సిరిసిల్లలో జాతీయ చేనేత దినోత్సవం

రాజన్న సిరిసిల్ల/వేములవాడ, వెలుగు: చేనేత వస్త్రాలను ధరించి నేత కార్మికులను ఆదుకోవాలని విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పిలుపునిచ్చారు. బుధవారం సిరిసిల్లలో జాతీయ చేనేత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని పాత బస్టాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సమీపంలోని చేనేత విగ్రహానికి కలెక్టర్ సందీప్ కుమార్ ఝాతో కలిసి ఎమ్మెల్యే పూలమాల వేశారు. అనంతరం బీవైనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ ప్రభుత్వం చేనేత రంగాన్ని అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటోందన్నారు. 

ఈ సందర్భంగా నిర్వహించిన పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. త్రెఫ్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పథకం కింద మంజూరైన రూ.2.64 కోట్ల విలువైన చెక్కును కార్మికులకు అందజేశారు. అంతకుముందు వేములవాడలోని మహాలక్ష్మి వీధిలో కొత్తగా ఏర్పాటు చేయనున్న కరెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్తంభాలకు భూమిపూజ చేశారు. ఆయా కార్యక్రమాల్లో సెస్​ డైరెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉమ, వైస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చైర్మన్​ బింగి మహేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, సిరిసిల్ల మున్సిపల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పర్సన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జిందం కళా, కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నియోజకర్గ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చార్జి కేకే మహేందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, హ్యాండ్లూమ్ టైక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శాఖ ఏడీ సాగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, కౌన్సిలర్లు, పాల్గొన్నారు. 

మల్యాల/రాయికల్​, వెలుగు: జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా మల్యాల, రాయికల్​ మండలకేంద్రాల్లో చేనేత దినోత్సవం నిర్వహించారు. మల్యాలలో కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహం వద్ద పద్మశాలీ కుల బాంధవులు వేడుకలు నిర్వహించారు. రాయికల్ పట్టణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో  చరకా యంత్రాలు, చేనేత మగ్గాలపై వస్త్రాలను నేసిన నాటి చేనేత కార్మికులను ఘనంగా సన్మానించారు. ముత్యంపేట మాజీ సర్పంచ్ త్రినాథ్ , బాలే నవీన్, రాజలింగం, గోవర్ధన్, తదితరులు పాల్గొన్నారు.