చివరి గింజ వరకు కొంటాం : ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం

  • చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం

చొప్పదండి, వెలుగు : నియోజకవర్గంలోని రైతాంగం ఇబ్బంది పడకుండా కంటికి రెప్పలా కాపాడుకుంటామని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. చొప్పదండి వ్యవసాయ మార్కెట్​, మండలంలోని రుక్మాపూర్, కొలిమికుంట, భూపాలపట్నం, వెదురుగట్ట గ్రామాల్లో సహకార సంఘం, ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ పమేలా సత్పతితో కలిసి ప్రారంభించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు ధాన్యం అమ్మి మద్దతు ధర పొందాలని సూచించారు. అడిషనల్ కలెక్టరు లక్ష్మీకిరణ్, ఏఎంసీ చైర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కొత్తూరు మహేశ్, ప్యాక్స్​ చైర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మల్లారెడ్డి, మున్సిపల్​ చైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పర్సన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గుర్రం నీరజ, కాంగ్రెస్​ మండల అధ్యక్షుడు శ్రీనివాస్​రెడ్డి, రైతులు పాల్గొన్నారు.

బోయినిపల్లి, వెలుగు : రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. సోమవారం బోయినిపల్లి మండలం తడగొండ, అనంతపల్లి, బోయినిపల్లి, కొదురుపాక గ్రామాల్లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. కాంగ్రెస్ మండల అధ్యక్షుడు వన్నెల రమణారెడ్డి, తహసీల్దార్ పుష్పలత, ఏవో ప్రణిత పాల్గొన్నారు.