కరీంనగర్ టౌన్, వెలుగు: వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు రైతులకు అవగాహన కల్పించాలని కలెక్టర్ పమేలా సత్పతి అధికారులకు సూచించారు. బుధవారం సిటీలోని కేడీసీసీ బ్యాంకు మీటింగ్ హాల్ లో పీఎం ఫసల్ బీమా యోజన పథకం అమలుపై రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ గ్రామాల వారీగా పంటల బీమా వివరాలను వ్యవసాయ అధికారులు నమోదు చేయాలన్నారు. అనంతరం కేడీసీసీ బ్యాంకును సందర్శించారు. చొప్పదండి ప్యాక్స్ దేశంలోనే అత్యుత్తమంగా నిలిచిందన్నారు.
అమ్మ ఆదర్శ స్కూల్ పనులను పూర్తి చేయాలి
జిల్లాలో 345 స్కూళ్లలో అమ్మ ఆదర్శ పథకంలో భాగంగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, వీటిని జూన్10లోపు పూర్తిచేయాలని ఆదేశించారు. అనంతరం డాక్టర్ భాగ్యరెడ్డి వర్మ జయంతి సందర్భంగా స్థానిక మాతాశిశు హాస్పిటల్ వద్ద గల భాగ్యరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, డీఈవో జనార్ధన్‌రావు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.