మానసిక ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలి : కలెక్టర్ ​హనుమంతు జెండగే 

యాదాద్రి, వెలుగు : మానసిక ఆందోళనకు గురై ఒత్తిడికి లోనవుతున్న వారికి సరైన సమయంలో ట్రీట్​మెంట్​అందించాలని కలెక్టర్​హనుమంతు జెండగే వైద్యులకు సూచించారు. వారి ఆరోగ్యం పట్ల ఎప్పటికప్పుడు శ్రద్ధ చూపాలన్నారు. ఈ విషయంలో డాక్టర్లకు అవగాహన కల్పించాలని అన్నారు. మానసిక ఆరోగ్య మాసోత్సవంలో భాగంగా కలెక్టరేట్లో నిర్వహించిన ట్రైనింగ్​కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

మానసిక ఒత్తడికి గురవుతున్న వారి కోసం 14416 టోల్​ ఫ్రీ నెంబర్​ ఏర్పాటు చేసినట్టు తెలిపారు. అనంతరం గుండాల మండలం పాచిల్ల మోడల్ హైస్కూల్ ను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేసి హాజర్ రిజిస్ట్రర్​ను పరిశీలించారు. ఇంటర్​ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థులతో కలెక్టర్ ముచ్చటించారు. సబ్జెక్టుల వారీగా వివరాలు అడిగి తెలుసుకున్నారు. 

ఆయిల్​పామ్ లక్ష్యం సాధించాలి.. 

నిర్దేశించిన లక్ష్యానికి అనుగుణంగా ఆయిల్​పామ్ సాగు చేయాలని కలెక్టర్​అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్​లో నిర్వహించిన రివ్యూ మీటింగ్​లో ఆయన మాట్లాడారు. ఈ ఏడాదిలో జిల్లావ్యాప్తంగా 25,00 ఎకరాల్లో సాగు చేయాలని నిర్దేశించగా, ఇప్పటివరకు 650 ఎకరాల్లో మొక్కలు నాటినట్టు చెప్పారు. రైతులను ప్రోత్సహించి మిగిలిన లక్ష్యాన్ని పూర్తి చేయాలని సూచించారు.

గడిచిన రెండేండ్లలో 3,500 ఎకరాల్లో సాగు చేసినట్టు తెలిపారు. ఆయా కార్యక్రమాల్లో డీఎంహెచ్​వో యశోధ, సైక్రియాట్రిస్ట్​ డాక్టర్​ప్రీతి స్వరూప్, డాక్టర్​మనోహర్, గుండాల తహసీల్దార్ జలకుమారి, ప్రిన్సిపాల్ రాము, అడిషనల్​ కలెక్టర్​ బెన్​షాలోమ్​, డీఏవో గోపాల్, హార్టికల్చర్ ఆఫీసర్​ సుభాషిణి తదితరులు పాల్గొన్నారు.