సీతారామ ప్రాజెక్ట్ పనులు స్పీడప్​ చేయాలి : కలెక్టర్​ ముజామ్మిల్​ఖాన్​

ఖమ్మం టౌన్, వెలుగు : సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్ట్ పనులను స్పీడప్​ చేయాలని ఖమ్మం కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ లో ప్రాజెక్ట్‌‌ పనుల పురోగతిపై నీటిపారుదల, రెవెన్యూ శాఖల అధికారులతో సమీక్షించారు. ప్రాజెక్టు భూనిర్వాసితులతో సంప్రదింపులు జరిపి, మిగులు భూ సేకరణ త్వరగా పూర్తి చేయాలన్నారు. 

అటవీ భూమలకు సంబంధించి ఆ శాఖ అనుమతులు తీసుకోవాలని చెప్పారు. ప్రభుత్వ లక్ష్యం మేరకు చివరి ఆయకట్టు వరకు నీళ్లు ఇచ్చేలా చర్యలు చేపట్టాలన్నారు. సమీక్షలో అడిషనల్​ కలెక్టర్ పి. శ్రీనివాస్​రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారిణి ఎం. రాజేశ్వరి, ఇరిగేషన్ అధికారులు పాల్గొన్నారు.