ఆన్​లైన్ ​మోసాలపై అలర్ట్​గా ఉండాలి : కలెక్టర్​ జితేశ్​వీ పాటిల్

కామారెడ్డి టౌన్, వెలుగు : ఆన్​లైన్ ​మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్​ జితేశ్​వీ పాటిల్ ​పేర్కొన్నారు. ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం సందర్భంగా శుక్రవారం కలెక్టరేట్​లో సివిల్​సప్లయ్​ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రోగ్రామ్​లో ఆయన మాట్లాడుతూ..

వినియోగదారుల రక్షణకు ప్రభుత్వం 2019లో చట్టం తీసుకొచ్చిందన్నారు. వస్తువులు కొనుగోలు చేసేటప్పుడు తప్పనిసరిగా బిల్లులు తీసుకోవాలన్నారు. డీఎస్​వో మల్లికార్జున్​బాబు, ఫుడ్​ ఇన్​స్పెక్టర్​ సునీత, డీఏవో భాగ్యలక్ష్మి పాల్గొన్నారు.

నిజామాబాద్ సిటీ : వినియోగదారుల హక్కుల పరిరక్షణకు సంబంధిత శాఖల అధికారులు కృషి చేయాలని అడిషనల్ ​కలెక్టర్ కిరణ్ కుమార్ సూచించారు. ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకుని కలెక్టరేట్​లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. వినియోగదారు తన హక్కులు, బాధ్యతలను తెలుసుకున్నప్పుడే నాణ్యమైన వస్తువులు, సంతృప్తికర సేవలు అందుతాయన్నారు.

అనంతరం ఆర్మూర్ మండల వినియోగదారుల సంఘం ముద్రించిన పాంప్లెంట్స్​ను ఆవిష్కరించారు. డీఎస్ఓ చంద్రప్రకాశ్, సివిల్ సప్లయ్​ డీఎం జగదీశ్, డీఈఓ దుర్గాప్రసాద్, జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ సుదర్శనం, తూనికలు, కొలతల శాఖ అధికారి నిర్మల్ కుమార్  పాల్గొన్నారు.